Wednesday, 10 October 2018

విజయ్ 'సర్కార్' టీజర్ రాబోతుంది ..!


విలక్షణ నటుడు తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కు సంబంధించిన పోస్టర్లపై ఆ మద్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, ప్రేమ్ కుమార్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.


దసరా కానుకగా ఈ నెల 19న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
http://www.cinesarathi.in/

No comments:

Post a Comment